ఆ ‘మహాలక్ష్మి’కి జీవితకాలం ఉచిత బస్‌పాస్‌

హైదరాబాద్‌ సిటీ బస్సులో శుక్రవారం జన్మించిన శిశువుకు జీవితకాలం పాటు ఉచిత ప్రయాణానికి బస్‌పాస్‌ ఇస్తున్నట్లు టీజీఆర్టీసీ ప్రకటించింది.

Published : 07 Jul 2024 02:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సిటీ బస్సులో శుక్రవారం జన్మించిన శిశువుకు జీవితకాలం పాటు ఉచిత ప్రయాణానికి బస్‌పాస్‌ ఇస్తున్నట్లు టీజీఆర్టీసీ ప్రకటించింది. గర్భిణికి పురుడుపోసి మానవత్వం చాటుకున్న కండక్టర్‌ సరోజ, డ్రైవర్‌ ఎంఎం అలీ సేవలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రశంసించారు. బస్‌భవన్‌లో ఉన్నతాధికారులతో కలిసి శనివారం వారిని సన్మానించారు. గర్భిణి శ్వేతారత్నం ముషీరాబాద్‌ డిపో బస్సులో శుక్రవారం ఉదయం ఆరాంఘర్‌ నుంచి వెళ్తుండగా.. పురిటి నొప్పులు ఎక్కువవ్వడంతో కండక్టర్‌ మహిళా ప్రయాణికుల సాయంతో ప్రసవం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని