రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన

రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ సూచించింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,

Published : 07 Jul 2024 02:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ సూచించింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మిగిలిన జిల్లాలో తేలికపాటి వానలు కురుస్తాయి. మంగళవారం సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.శనివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా వరంగల్‌ జిల్లా చెన్నారావుపేటలో 6.8 సెం.మీటర్లు, ఖానాపూర్‌ మండలం మంగళవారిపేట5.6, మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ5.4, భద్రాద్రి జిల్లా గుండాలలో 4.7, భద్రాచలం 4.1, నిర్మల్‌లో 3.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని