గోండు భాషలో మహాభారతం

గిరిజనులకు మహాభారతాన్ని చేరువ చేయడానికి ఓ ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆదిలాబాద్‌ జిల్లా మావల మండలం వాఘాపూర్‌ గ్రామానికి చెందిన తొడసం కైలాస్‌ ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

Published : 07 Jul 2024 02:51 IST

ఆదివాసీ ఉపాధ్యాయుడి ఆదర్శం 

ఉపాధ్యాయుడు తొడసం కైలాస్‌ గోండు భాషలో రాసిన మహాభారతం పుస్తకం

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ గ్రామీణం: గిరిజనులకు మహాభారతాన్ని చేరువ చేయడానికి ఓ ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆదిలాబాద్‌ జిల్లా మావల మండలం వాఘాపూర్‌ గ్రామానికి చెందిన తొడసం కైలాస్‌ ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మహాభారతంలోని కథలను చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి విని, వీధి నాటకాలు, టీవీలలో చూసిన కైలాస్‌ స్ఫూర్తి పొందారు. రామకృష్ణ మఠం వారు అయిదు సంపుటాల్లో వెలువరించిన బాలల మహాభారతాన్ని కరోనా సమయంలో తన మాతృభాష గోండులోకి అనువదించారు. పిల్లలు, యువతలో మంచి ఆలోచనలు కలిగించడానికి ‘సద్‌ విచార్‌’ పేరిట మరో పుస్తకం రాశారు. విద్యార్థులలో నైతిక విలువలు పెంచడానికి, ప్రజలకు వార్తలు అందించడానికి గోండు భాషలో ఒక యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతున్నారు. మహాభారతంపై గిరిజనుల్లో అమిత ఆసక్తి ఉన్నా... చదువుకోవడానికి భాషాపరమైన ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. దాంతో మూడు నెలల కిందట ఆ గ్రంథాన్ని గోండు భాషలోకి తెలుగు లిపిలో అనువదించడం ప్రారంభించారు. జూన్‌లో 18 పర్వాలతో 272 పేజీల ‘‘పండోక్న మహా భారత్‌ కథ’’ పేరిట విజయవంతంగా పూర్తి చేశారు. ఆదిలాబాద్‌ జడ్పీ సమావేశ మందిరంలో నేడు(ఆదివారం) ప్రముఖులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు