ఈవీల ఉత్పత్తిలో అగ్రస్థానమే లక్ష్యం

విద్యుత్‌ వాహనా(ఈవీ)ల ఉత్పత్తి కేంద్రంగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో తనను కలిసిన ఈటో త్రిచక్ర (ఆటో) విద్యుత్‌ వాహనాల సంస్థ ప్రతినిధులకు ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు.

Published : 07 Jul 2024 02:53 IST

మంత్రి శ్రీధర్‌బాబు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ వాహనా(ఈవీ)ల ఉత్పత్తి కేంద్రంగా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో తనను కలిసిన ఈటో త్రిచక్ర (ఆటో) విద్యుత్‌ వాహనాల సంస్థ ప్రతినిధులకు ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈవీలతో పాటు వాటికి అవసరమైన లిథియం బ్యాటరీల తయారీ పరిశ్రమలకు ప్రభుత్వ విధానం ప్రకారం ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పనలో ఆటంకాలు లేకుండా చూస్తామని వెల్లడించారు. ఏటా పది వేల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ఈటో ఎలక్ట్రిక్‌ సంస్థ జడ్చర్ల వద్ద ఏర్పాటు చేసిన పరిశ్రమను మరింత విస్తరించాలని మంత్రి సూచించారు. విద్యుత్‌ వాహనాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్నందున విదేశీ పెట్టుబడులను తీసుకువస్తే ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. మహిళా ఆటో డ్రైవర్లను ప్రోత్సహించేందుకు ఈటో సంస్థ చేపట్టిన కార్యక్రమాన్ని శ్రీధర్‌బాబు ప్రశంసించారు. హైదరాబాద్, జిల్లా కేంద్రాల్లో మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారు సొంతంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని