సిబ్బంది కొరత ఉన్న కళాశాలల ధ్రువీకరణ దరఖాస్తు గడువు 12

జేఎన్‌టీయూ అనుబంధ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల గుర్తింపు పునరుద్ధరణ క్రతువు ముగింపు దశకు చేరింది. మొత్తం 138 ఇంజినీరింగ్‌ కళాశాలలకుగాను 78 చోట్ల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు.

Published : 07 Jul 2024 03:05 IST

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ అనుబంధ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల గుర్తింపు పునరుద్ధరణ క్రతువు ముగింపు దశకు చేరింది. మొత్తం 138 ఇంజినీరింగ్‌ కళాశాలలకుగాను 78 చోట్ల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయా కొరత(డెఫిషియెన్సీ)లను భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ.. ఇప్పటికే అప్పిలేట్‌ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఆయా కళాశాలల వినతులను పరిశీలించి ఆ నివేదికను ఇన్‌ఛార్జి వీసీ బుర్రా వెంకటేశంకు సమర్పించారు. కొరతలున్న కళాశాలల నుంచి అండర్‌టేకింగ్‌ సైతం తీసుకున్న అనంతరం శనివారం ఇన్‌ఛార్జి వీసీ, వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు తదితరులతో సమీక్షించారు. కొరతలున్న కళాశాలల నిర్వాహకులు ధ్రువీకరణ కోసం ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని సమాచారమిచ్చారు. దరఖాస్తు చేసుకున్న కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు వర్సిటీ అధికారులు ఇంటర్వ్యూ నిర్వహించి వారి అర్హతలను ధ్రువీకరిస్తారు. సీట్ల పెంపునకు కళాశాలల నుంచి వచ్చిన అభ్యర్థనలపై కూడా రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు అధికారిక సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని