దండు మల్కాపూర్‌ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మించండి

యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్‌ హరిత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు వద్ద హైదరాబాద్‌- విజయవాడ రహదారిపై ఫ్లైఓవర్‌ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్‌) కోరింది.

Published : 07 Jul 2024 03:29 IST

మంత్రి కోమటిరెడ్డికి టిఫ్‌ వినతి 

మంత్రి కోమటిరెడ్డికి వినతిపత్రం ఇస్తున్న టిఫ్‌ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, ఇతర నేతలు 

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్‌ హరిత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కు వద్ద హైదరాబాద్‌- విజయవాడ రహదారిపై ఫ్లైఓవర్‌ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఫ్‌) కోరింది. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, ఇతర నేతలు గోపాల్‌రావు, జలంధర్‌రెడ్డి, స్వామిగౌడ్, ఏఎల్‌ఎన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌లో శనివారం మంత్రి వెంకట్‌రెడ్డిని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రాంతంలో రూ.6,675 కోట్ల పెట్టుబడులతో 1500 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, 45,000 మంది ప్రత్యక్షంగా, 35,000 మంది పరోక్షంగా ఉపాధి పొందుతారని తెలిపారు. పార్కు సమీపంలోని ఆందోల్‌ మైసమ్మ గుడి వద్ద ఏర్పడే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఫ్లైఓవర్‌ నిర్మించాలని సుధీర్‌రెడ్డి ఇతర నేతలు కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని