డీఎస్‌ సేవలు మరువలేనివి

పీసీసీ  మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ధర్మపురి శ్రీనివాస్‌ వివాదరహితుడు, స్నేహశీలి అని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు.

Published : 08 Jul 2024 03:24 IST

గచ్చిబౌలిలో సంస్మరణ కార్యక్రమం
వివిధ పార్టీల నేతల నివాళి

డీఎస్‌కు నివాళులర్పించి ఎంపీ అర్వింద్‌ను పలకరిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: పీసీసీ  మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ధర్మపురి శ్రీనివాస్‌ వివాదరహితుడు, స్నేహశీలి అని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. డీఎస్‌ సంస్మరణ సభను ఆదివారం గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో ఆయన కుటుంబసభ్యులు, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొని సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఏపీ మంత్రి సత్యకుమార్, ఎంపీలు విజయేంద్రప్రసాద్, ఈటల రాజేందర్, డీకే అరుణ, డాక్టర్‌ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, వివేక్, కౌశిక్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీలు హర్షకుమార్, వీహెచ్, సీతారాం నాయక్, రంజిత్‌రెడ్డి, కేవీపీ, మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సంతోష్‌రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్‌ నారాయణ తదితరులు విచ్చేసి డీఎస్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ... పార్టీలకు అతీతంగా డీఎస్‌కు పరిచయాలున్నాయని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కీలక భూమిక పోషించారని పేర్కొన్నారు. ఏదైనా తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకొనే వారని.. నేటి తరం రాజకీయ నాయకులు డీఎస్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని