డిఫాల్ట్‌ బెయిల్‌ కోసం కవిత పిటిషన్‌

దిల్లీ మద్యం కేసులో తన పాత్రపై సీబీఐ సకాలంలో ఛార్జిషీట్‌ దాఖలు చేయని కారణంగా డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ భారాస ఎమ్మెల్సీ కవిత ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 09 Jul 2024 02:48 IST

విచారణ శుక్రవారానికి వాయిదా

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో తన పాత్రపై సీబీఐ సకాలంలో ఛార్జిషీట్‌ దాఖలు చేయని కారణంగా డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ భారాస ఎమ్మెల్సీ కవిత ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ జూన్‌ 7న తనపై ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ అందులో తప్పులున్న కారణంగా ఇంతవరకూ కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు.  సోమవారం దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా.. గురువారంలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సీబీఐ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొనే అంశంపైనా అదేరోజు విచారిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని