11 నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లు

డీఎస్సీ హాల్‌టికెట్లు ఈనెల 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని, వాటిని అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి సోమవారం తెలిపారు.

Published : 09 Jul 2024 03:05 IST

షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షల నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: డీఎస్సీ హాల్‌టికెట్లు ఈనెల 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని, వాటిని అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి సోమవారం తెలిపారు. ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ప్రకటించింది. పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సమయం చాలా తక్కువ ఇచ్చారని, దానికితోడు గ్రూపు-2 పరీక్షలు ఉన్నందున కనీసం నెలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. అయితే హాల్‌టికెట్లను www.schooledu.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రకటించడంతో పరీక్షల వాయిదా ఉండదని స్పష్టం చేసినట్లయ్యింది. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు డీఎస్సీ నిర్వహిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని