కోస్గి ఇంజినీరింగ్‌ కళాశాల ఫీజు రూ.50 వేలు

రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం(2024-25) కోస్గిలో ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ కోర్సుల ఫీజు రూ.50 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 09 Jul 2024 03:06 IST

బీటెక్‌ సీట్ల భర్తీకి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం(2024-25) కోస్గిలో ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ కోర్సుల ఫీజు రూ.50 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రైవేట్, యూనివర్సిటీ కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఈసారి ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలను సర్కారు నెలకొల్పింది. అక్కడున్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ఉన్నతీకరించింది. దాంట్లో సీఎస్‌ఈ(డేటా సైన్స్‌), సీఎస్‌ఈ, సీఎస్‌ఈ(ఏఐ అండ్‌ ఎంఎల్‌) కోర్సులున్నాయి. బీటెక్‌ సీట్ల భర్తీకి సోమవారం నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 

మరికొన్ని ముఖ్యాంశాలివీ... 

  • మొత్తం 173 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 22 మహిళా కళాశాలలే. ఈసారి పాల్వంచలోని బోస్‌ కళాశాలను మహిళా కాలేజీగా మార్చారు.  
  • మొత్తం 152 ప్రైవేట్‌ కళాశాలల్లో 67 యూజీసీ స్వయంప్రతిపత్తి కాలేజీలున్నాయి. అంటే ఆ కళాశాలలే పరీక్షలు నిర్వహించుకొని.. ఫలితాలు వెల్లడిస్తాయి. మిగిలిన వాటిల్లోని విద్యార్థులకు ఆయా విశ్వవిద్యాలయాలే ప్రశ్నపత్రాలు పంపి పరీక్షలు జరుపుతాయి. 
  • తొలివిడత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటాలో 70,307 బీటెక్‌ సీట్లుండగా.. వాటికి 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ సీట్లు కలవనున్నాయి.  
  • జేఎన్‌టీయూహెచ్‌ పాలేరు, మహబూబాబాద్‌ కళాశాలల్లో ఈసారి అదనంగా రెండేసి కోర్సులు చేరాయి. 
  • యూనివర్సిటీల్లోని కోర్సులు కొన్ని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో ఉంటాయి. ఆ సీట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదు.
  • ఒక యాజమాన్యం పరిధిలో ఒకే తరహా పేరుతో రెండు మూడు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. అవి ఉన్న ప్రాంతాలు కూడా వేరు. అందువల్ల వాటిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని