రెండు ప్రాజెక్టులను ప్రారంభించనున్న సీఎం

రెండు సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభింప జేసేందుకు నీటిపారుదల శాఖ ముమ్మర ఏర్పాటు చేస్తోంది.

Updated : 09 Jul 2024 03:28 IST

ఈ నెలాఖరున నిర్మల్‌ జిల్లాలోని సదర్‌మాట్‌ బ్యారేజీ..
వచ్చే నెల 15న భద్రాద్రి జిల్లాలో రాజీవ్‌ కాలువ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రెండు సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభింప జేసేందుకు నీటిపారుదల శాఖ ముమ్మర ఏర్పాటు చేస్తోంది. ఈ నెలాఖరున.. నిర్మల్‌ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన సదర్‌మాట్‌ బ్యారేజీని.. వచ్చే నెల 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజీవ్‌ కాలువను సీఎం ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పటికప్పుడు వివరాలు ఆరా తీస్తున్నారు. 

రాజీవ్‌ కాలువ పనులను పరిశీలిస్తున్న సీఈ శ్రీనివాసరెడ్డి, ఇతర ఇంజినీర్లు

రెండు ప్రాజెక్టుల కింద 1.36 లక్షల ఎకరాలకు నీళ్లు 

గోదావరి నదిపై నిర్మల్‌ జిల్లా మామడ మండలంలోని పొన్కల్‌ వద్ద నిర్మించిన సదర్‌మాట్‌ బ్యారేజీ కింద నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని 18 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. కొత్త ఆయకట్టు 12 వేల ఎకరాలు ఉందని నీటిపారుదల ఇంజినీర్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో సీతారామ ఎత్తిపోతల కాలువ 100.2 కిలోమీటర్‌ వద్ద నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కాలువ 52వ కిలోమీటరు వద్ద.. రెండింటినీ అనుసంధానించేలా రాజీవ్‌ కాలువ నిర్మించారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కాలువ కింద సాగునీరు అందని చివరి ఆయకట్టుకు నీటిని అందించాలనేది ఈ కాలువ నిర్మాణ లక్ష్యం. మూడు నియోజకవర్గాల పరిధిలో 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని