నేడు పది జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలో బుధవారం పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది.

Published : 10 Jul 2024 03:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బుధవారం పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయంది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరుగా కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. మంగళవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో 6.2 సెంటీమీటర్లు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.1, పాల్వంచ మండలం సీతారాంపట్నంలో 5.2, జయశంకర్‌ జిల్లా చిట్యాలలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని