ఇంటింటా ఇన్నోవేటర్‌కు దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం (టీఎస్‌ఐసీ-తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌) నిర్వహిస్తున్న 6వ విడత ‘ఇంటింటా ఇన్నోవేటర్‌-2024’ కార్యక్రమానికి ఔత్సాహిక ఆవిష్కర్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

Published : 10 Jul 2024 03:13 IST

గ్రామీణ ఆవిష్కర్తలను ప్రోత్సహించడమే లక్ష్యం  

రాయదుర్గం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం (టీఎస్‌ఐసీ-తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌) నిర్వహిస్తున్న 6వ విడత ‘ఇంటింటా ఇన్నోవేటర్‌-2024’ కార్యక్రమానికి ఔత్సాహిక ఆవిష్కర్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. టీఎస్‌ఐసీ చేపడుతున్న అత్యంత ప్రధానమైన ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. 

దరఖాస్తు చేసుకోవాలిలా..: ఆవిష్కర్తలు 9100678543 సెల్‌ నంబరుకు వాట్సప్‌ ద్వారా దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులో పేరు, వయసు, ఫొటో, వృత్తి, గ్రామం, మండలం, ఆవిష్కరణ పేరు, వంద పదాల్లో ఆవిష్కరణ వివరాలు, నాలుగు హై రిజల్యూషన్‌ ఆవిష్కరణ చిత్రాలు, ఆవిష్కరణ విధులను ప్రదర్శించే రెండు వీడియోలు ఆగస్టు 3లోగా పంపించాలని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని