కరెంటు ఫిర్యాదులపై వెంటనే స్పందించండి

నిత్యం వినియోగదారులకు అందుబాటులో ఉంటూ కరెంటు సమస్యలపై వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని విద్యుత్‌ ఇంజినీర్లకు ఇంధనశాఖ రాష్ట్ర కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ ఆదేశించారు.

Published : 10 Jul 2024 03:16 IST

ఇంధనశాఖ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ ఆదేశం   

ఈనాడు, హైదరాబాద్‌: నిత్యం వినియోగదారులకు అందుబాటులో ఉంటూ కరెంటు సమస్యలపై వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని విద్యుత్‌ ఇంజినీర్లకు ఇంధనశాఖ రాష్ట్ర కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌ ఆదేశించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణి సంస్థ(డిస్కం) ప్రధాన కార్యాలయంలో మంగళవారం సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీతో పాటు ఇంజినీర్లతో మొదటిసారి ఆయన సమీక్ష జరిపారు. డిస్కం పరిధిలోని సర్కిళ్ల వారీగా విద్యుత్‌ సరఫరాపై అధికారులతో మాట్లాడారు. ‘‘ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలి. చీఫ్‌ ఇంజినీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, స్థానిక ప్రజా ప్రతినిధులతో, వినియోగదారులతో సమావేశమవ్వాలి’’ అని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని