అవసరమైన ఎరువులిస్తాం

వానాకాలం సీజన్‌లో తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ చేస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

Published : 10 Jul 2024 03:16 IST

మంత్రి తుమ్మలకు కేంద్రమంత్రి నడ్డా లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం సీజన్‌లో తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ చేస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన మంగళవారం లేఖ రాశారు. డీఏపీకి కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణకు ఏప్రిల్, మే మాసాల్లో డీఏపీ 1.12 లక్షల టన్నులు అవసరం ఉండగా... 0.43 లక్షలే కేంద్రం నుంచి వచ్చింది. మిగిలింది జులైలోనే పంపించాలని తుమ్మల కేంద్రమంత్రికి లేఖ రాశారు. నడ్డా స్పందించి తాజాగా లేఖ రాశారు. డీఏపీని పంపిస్తామని, ఎరువుల సరఫరాలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు