సీఎం సొంతూరుకు చేరువలో కొత్త వైద్య కళాశాల!

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపించేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి సమీపంలో కల్వకుర్తి/అచ్చంపేట నియోజకవర్గాల్లో ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నారు.

Published : 10 Jul 2024 03:18 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపించేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి సమీపంలో కల్వకుర్తి/అచ్చంపేట నియోజకవర్గాల్లో ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నారు. రెండు రోజుల క్రితం వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ నిర్వహించిన సమీక్ష సమావేశంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మరో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అక్కడ వైద్య కళాశాల ఏర్పాటుతో అచ్చంపేట, కల్వకుర్తి నియోజవర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని