ప్రభుత్వ చొరవతోనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం

రాష్ట్రంలోని గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 10 Jul 2024 03:19 IST

పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి

మాట్లాడుతున్న పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి. వేదికపై ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు భట్టాపురం మోహన్‌రెడ్డి, పూల రవీందర్, యూనియన్‌ మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకులు ఇన్నారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు

కొల్లాపూర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంల సంఖ్యను 10 వేలకు పెంచాలని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిలలో పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం మంగళవారం జరిగింది. వివిధ తీర్మానాలు ఆమోదించారు. జీవో నంబర్లు 11, 12లను సవరిస్తూ బీఈడీ అర్హత ఉన్న ఉపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా పదోన్నతి ఇవ్వాలన్నారు. సీపీఎస్‌ను విధానం రద్దు చేసి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛను వర్తింపజేయాలని, పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు ఇవ్వాలని పేర్కొన్నారు. తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు భట్టాపురం మోహన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకులు ఇన్నారెడ్డి, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంఘంనేతలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని