కలెక్టర్‌ సహా అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాలపల్లిలో వాటర్‌ ట్యాంకు, పాఠశాల, బస్టాండ్‌ నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టి సంబంధిత భూయజమానికి పరిహారం చెల్లించాలన్న ఆదేశాలు అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో యాదాద్రి కలెక్టర్, భువనగిరి ఆర్డీవో, తుర్కపల్లి ఎంపీడీవో, తహసీల్దార్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Published : 10 Jul 2024 03:22 IST

పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాలపల్లిలో వాటర్‌ ట్యాంకు, పాఠశాల, బస్టాండ్‌ నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టి సంబంధిత భూయజమానికి పరిహారం చెల్లించాలన్న ఆదేశాలు అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో యాదాద్రి కలెక్టర్, భువనగిరి ఆర్డీవో, తుర్కపల్లి ఎంపీడీవో, తహసీల్దార్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 5న వ్యక్తిగతంగా హాజరై కోర్టు ధిక్కరణపై ఎందుకు శిక్ష విధించరాదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మార్కెట్‌ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలంటూ 2022 ఆగస్టులో ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో గోపాలపురానికి చెందిన రహీముద్దీన్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 85 ఏళ్ల వృద్ధుడి భూమిని తీసుకుని, హైకోర్టు ఆదేశించినా పరిహారం చెల్లించలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని