ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌ నియామకంపై హైకోర్టు నోటీసులు

తెలంగాణ ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌గా జి.వైజయంతి నియామకంపై బుధవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది.

Published : 11 Jul 2024 02:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌గా జి.వైజయంతి నియామకంపై బుధవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. కొత్తగా వచ్చిన బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్‌ 25ఎ(2) ప్రకారం ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌ పోస్టులో వైజయంతి కొనసాగడానికి అర్హత నిరూపించుకునేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది ఎస్‌.ఎల్‌.శ్రీనివాసులు, మరొకరు కోవారంటో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం పదేళ్లకు తక్కువ కాకుండా ప్రాక్టీస్‌ చేసిన న్యాయవాదులు మాత్రమే ఈ పదవికి అర్హులని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో ఈ పదవిని భర్తీచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని