బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్‌ రాధాకృష్ణన్‌

తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం దిల్లీలో తెలంగాణ భవన్‌లో జరిగిన లాల్‌ దర్వాజ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Published : 11 Jul 2024 03:32 IST

 దిల్లీ తెలంగాణ భవన్‌లో జరిగిన లాల్‌దర్వాజ బోనాల ఉత్సవంలో బంగారుబోనం ఎత్తుకున్న గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌

ఈనాడు, దిల్లీ: తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం దిల్లీలో తెలంగాణ భవన్‌లో జరిగిన లాల్‌ దర్వాజ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయనకు లాల్‌దర్వాజ బోనాల కమిటీ సభ్యులు స్వాగతం పలుకగా.. గవర్నర్‌ బంగారు బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. తాను బోనాల ఉత్సవాల్లో పాల్గొనడం ఇది రెండోసారని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగురాష్ట్రాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని