ఆరేళ్లు పూర్తయితే తప్పుకోవాల్సిందే..

రాష్ట్రవ్యాప్తంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ(ఐఆర్‌సీఎస్‌) కమిటీల్లో కీలక బాధ్యులుగా ఎన్నికై.. ఆరేళ్లకు పైగా గానీ, రెండు విడతలుగా గానీ కొనసాగుతున్నవారు ఇక నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాల్సిందే.

Published : 11 Jul 2024 02:54 IST

రెడ్‌క్రాస్‌ సొసైటీకి గవర్నర్‌ కార్యాలయం ఆదేశాలు 

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ(ఐఆర్‌సీఎస్‌) కమిటీల్లో కీలక బాధ్యులుగా ఎన్నికై.. ఆరేళ్లకు పైగా గానీ, రెండు విడతలుగా గానీ కొనసాగుతున్నవారు ఇక నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాల్సిందే. ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఐఆర్‌సీఎస్‌కు రాష్ట్రస్థాయిలో గవర్నర్‌ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఏళ్లుగా పాతుకుపోయినవారిని పక్కనపెట్టి కొత్తవారికి అవకాశమిస్తే సంస్థ అభివృద్ధితోపాటు సేవా కార్యక్రమాలపై మరింత ఎక్కువ దృష్టి సారిస్తారన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒక్కో జిల్లాలోని సొసైటీ కమిటీలో 10-15 మంది సభ్యులు ఉంటారు. ఇందులో కీలక పదవుల్లో(రాష్ట్ర కమిటీ సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కోశాధికారి) ఆరేళ్లు పూర్తి చేసుకున్న, రెండు విడతల పదవీ కాలం పూర్తయిన వారు రాజీనామా చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని