బడుల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై పరిశీలన

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులున్నాయో తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు బుధవారం పలు జిల్లాల్లో స్వయంగా పాఠశాలలను పరిశీలించారు.

Published : 11 Jul 2024 03:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులున్నాయో తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు బుధవారం పలు జిల్లాల్లో స్వయంగా పాఠశాలలను పరిశీలించారు. ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులు అందరూ వస్తున్నారా? విద్యార్థుల హాజరు శాతం ఎలా ఉంది? తదితర అంశాలను అదనపు డైరెక్టర్లు, జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులు పరిశీలించారు. పాఠశాల విద్యాశాఖ నూతన సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు పరిశీలనకు వెళ్లారు. తనిఖీలు చేయవద్దని, ఉన్న పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో వారు ప్రస్తుతం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పరిశీలన గురువారమూ కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని