ప్రమాదానికి నిచ్చెన!

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కొత్త సూగూరు గ్రామంలోని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ దీపాలు కొన్ని రోజులుగా వెలగడం లేదు.

Published : 11 Jul 2024 03:33 IST

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కొత్త సూగూరు గ్రామంలోని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ దీపాలు కొన్ని రోజులుగా వెలగడం లేదు. గ్రామపంచాయతీ పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతంలో అంధకారం నెలకొంది. గ్రామానికి చెందిన కొందరు యువకులు పొక్లెయిన్‌ సాయంతో మరమ్మతులకు ఉపక్రమించారు. హైమాస్ట్‌ స్తంభానికి నిచ్చెన ఎత్తు సరిపోకపోవడంతో.. ఆ నిచ్చెనకు మరో నిచ్చెన కట్టి దానిని పొక్లెయిన్‌ బకెట్‌లో ప్రమాదకరంగా నిలబెట్టి ఆకాశ దీపాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.

 న్యూస్‌టుడే, పెబ్బేరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు