బీసీ బిల్లు సాధనకు లక్ష మందితో బహిరంగ సభలు

పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు.

Published : 11 Jul 2024 03:31 IST

బీసీల మేధోమథన సభలో ఆర్‌.కృష్ణయ్య

బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో ఐక్యత ప్రదర్శిస్తున్న ఆర్‌.కృష్ణయ్య, వీహెచ్, బీసీ సంఘాల నేతలు

బషీర్‌బాగ్, న్యూస్‌టుడే: పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు మొదటి వారంలో నల్గొండ, వరంగల్, మెదక్‌ జిల్లాల్లో లక్ష మందితో భారీ బహిరంగసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ లాల్‌కృష్ణ, జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ నేతృత్వంలో బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో బీసీల మేధోమథన సమావేశం నిర్వహించారు. సమావేశానికి 48 బీసీ కుల సంఘాలు, 36 బీసీ సంఘాలు, 28 బీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పలు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకు జిల్లాల్లో బీసీ చైతన్య సదస్సులు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. రాజ్యాధికారం ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని, బీసీలు ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నేతలు ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేశ్, గొరిగె మల్లేశ్‌ యాదవ్, జిల్లపల్లి అంజి, గుజ్జ సత్యం, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని