దండకారణ్యంపై యూఏవీతో నిఘా!

దేశంలో మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని వార్‌జోన్‌గా భావించే దండకారణ్యంలో మరో ఆపరేషన్‌కు భద్రతా బలగాలు ప్రణాళికను రూపొందిస్తున్నాయి.

Published : 11 Jul 2024 03:05 IST

చర్ల, న్యూస్‌టుడే: దేశంలో మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని వార్‌జోన్‌గా భావించే దండకారణ్యంలో మరో ఆపరేషన్‌కు భద్రతా బలగాలు ప్రణాళికను రూపొందిస్తున్నాయి. మావోయిస్టులను కట్టడి చేసే చర్యల్లో భాగంగా యూఏవీ(అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌)తో 200 కి.మీ. పరిధిలో డేగ కన్ను వేసేందుకు కార్యచరణ చేపడుతున్నారు. మావోయిస్టుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టేందుకు దీనిని వినియోగించనున్నారు. ప్రస్తుతం కీకారణ్యాల్లో డ్రోన్లతో మావోయిస్టుల కదలికలను గుర్తిస్తూ భద్రతా బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేస్తున్నాయి. యూఏవీ విధానంలో రాడార్‌ను నేరుగా సెంట్రల్‌ మానిటర్‌ రూమ్‌లకు అనుసంధానం చేస్తారు. ఆ చిత్రాల ఆధారంగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని