ఆలమట్టిలోకి 84,645 క్యూసెక్కుల ప్రవాహం

కృష్ణా నదిపై కర్ణాటకలోని ఆలమట్టి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గోదావరిలో మాత్రం నామమాత్రంగానే ఉంది.

Published : 11 Jul 2024 03:06 IST

 

81.44 టీఎంసీలకు చేరిన నిల్వ
గోదావరికి ప్రాణహిత నుంచి 41 వేల క్యూసెక్కులు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా నదిపై కర్ణాటకలోని ఆలమట్టి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గోదావరిలో మాత్రం నామమాత్రంగానే ఉంది. ప్రాణహిత నుంచి వచ్చే వరదతో మేడిగడ్డ వద్ద గోదావరిలో 41 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు నామమాత్రంగానే ఉన్నాయి. కొన్నింటిలోకి అసలు లేవు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై 40 రోజులు దాటినా ఒక టీఎంసీ కూడా రాని రిజర్వాయర్లున్నాయి. 

  • కృష్ణా బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆలమట్టికి క్రమంగా వరద పెరిగి బుధవారం 84,645 క్యూసెక్కులకు చేరింది. నీటి నిల్వ సైతం 81.44 టీఎంసీలకు చేరింది. మరో 40 టీఎంసీలు వస్తే గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలే అవకాశం ఉంది. నారాయణపూర్‌లో మరో పది టీఎంసీలకు మాత్రమే అవకాశం ఉంది. తుంగభద్రలోకి కూడా కొంత ప్రవాహం పెరిగింది. అయితే ఈ ప్రాజెక్టు నిండటానికి మరో 80 టీఎంసీలు అవసరం. తెలుగు రాష్ట్రాల్లోని ఆయకట్టుకు సాగునీరందించే శ్రీశైలంలోకి 2,256 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. నాగార్జునసాగర్‌లోకి ఇప్పటివరకు ఎలాంటి ప్రవాహం లేదు. 
  • గోదావరిలో ఏ ప్రాజెక్టులోకి కూడా రెండువేల క్యూసెక్కుల ప్రవాహం రావడం లేదు. శ్రీరామసాగర్‌ (ఎస్సారెస్పీ)లోకి 1852 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నిల్వ 12.32 టీఎంసీలకు చేరింది. మరో 77 టీఎంసీలు వస్తే కానీ ఈ ప్రాజెక్టు నిండదు. ప్రవాహం భారీగా పెరిగితే కానీ ఆయకట్టుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. నిజాంసాగర్, మధ్యమానేరు, దిగువమానేరు ప్రాజెక్టుల్లోకి ఎలాంటి ప్రవాహాలు లేవు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని