పెరుగుతున్న సాగు విస్తీర్ణం

రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోందని.. ఇప్పటికి 54,61,238 ఎకరాల మేర పంటలు వేశారని వ్యవసాయ శాఖ వెల్లడించింది.

Published : 11 Jul 2024 03:09 IST

54,61,238 ఎకరాల్లో పంటలు
వానాకాలం సీజన్‌పై వ్యవసాయ శాఖ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోందని.. ఇప్పటికి 54,61,238 ఎకరాల మేర పంటలు వేశారని వ్యవసాయ శాఖ వెల్లడించింది. సాధారణ సాగు విస్తీర్ణంలో ఇది 42.23 శాతమని తెలిపింది. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా పంటల విస్తీర్ణంపై వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పత్తి 36,88,217 ఎకరాల్లో, వరి 4,14,016 ఎకరాల్లో సాగవుతోందని పేర్కొంది. సోయాబీన్‌ 3,20,213 ఎకరాల్లో, మొక్కజొన్న 2,57,994 ఎకరాల్లో, కందులు 2,95,033 ఎకరాల్లో, పెసలు 44,141 ఎకరాల్లో సాగుచేశారని వ్యవసాయ శాఖ తెలిపింది. వచ్చే వారం నుంచి వరినాట్లు జోరుగా సాగుతాయని నివేదించింది. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులను అందుబాటులో ఉంచామని తెలిపింది. 

జిల్లాలవారీగా..

రాష్ట్రంలో 8 జిల్లాల్లో(కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మెదక్, ములుగు, మేడ్చల్‌ మల్కాజిగిరి, వనపర్తి, సూర్యాపేట) 25 శాతంలోపే పంటలు వేశారని నివేదిక తెలిపింది. రెండు జిల్లాల్లో (ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌) 76 శాతం, ఆరు జిల్లాల్లో (నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి, వికారాబాద్‌) 55 శాతం పంటలు సాగవుతున్నాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో 40 శాతం మేర పంటలు వేశారని వెల్లడించింది. తొమ్మిది జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయ శాఖ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని