యాదాద్రిలో తిరుమల తరహాలో దర్శనాలు

తిరుమల తరహాలో యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహులను దర్శించుకునే ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు.

Published : 11 Jul 2024 03:32 IST

ప్రారంభించిన ఎంపీ చామల, ఎమ్మెల్యే అయిలయ్య

మహాముఖ మండపంలో ఏర్పాటు చేసిన నూతన వేదికపై ఎమ్మెల్యే అయిలయ్య,

ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌రావు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: తిరుమల తరహాలో యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహులను దర్శించుకునే ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. గర్భగుడిలోని నారసింహుడిని మహాముఖ మండపంలో 26 అడుగుల దూరంలో ఉన్న వేదికపై నుంచి దర్శించుకోవచ్చని ఆలయ ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు. రూ.150 శీఘ్ర, ధర్మ దర్శన మార్గాలు గర్భగుడి వద్దకు చేరుకునే విధానంలో మార్పు తెచ్చి ఆ వరుసల్లోని భక్తులను కొత్తగా ఏర్పాటైన వేదిక పైనుంచి పంపిస్తారు. కొత్తగా నిర్మితమైన అన్నప్రసాద సముదాయంలో నిత్యం 5 వేల మంది భక్తులకు అన్నప్రసాద సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎంపీ, ఎమ్మెల్యే వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని