క్రెడాయ్‌ రాష్ట్ర సదస్సుకు సీఎంకు ఆహ్వానం

క్రెడాయ్‌ రాష్ట్ర సదస్సు-24ను ప్రారంభించేందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని క్రెడాయ్‌ ప్రతినిధులు ఆహ్వానించారు.

Published : 11 Jul 2024 03:33 IST

రాష్ట్ర సదస్సు ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తున్న

క్రెడాయ్‌ ప్రతినిధులు ఇంద్రసేనారెడ్డి, ప్రేమ్‌సాగర్‌రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, అజయ్‌కుమార్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: క్రెడాయ్‌ రాష్ట్ర సదస్సు-24ను ప్రారంభించేందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని క్రెడాయ్‌ ప్రతినిధులు ఆహ్వానించారు. క్రెడాయ్‌ తెలంగాణ ఛైర్మన్‌ మురళీకృష్ణారెడ్డి, అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్‌రెడ్డి, తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శి అజయ్‌కుమార్, కోశాధికారి జగన్మోహన్‌ బుధవారం సచివాలయంలో సీఎంను కలిసి ఆగస్టులో జరగనున్న సదస్సుకు సంబంధించిన ఆహ్వానపత్రం అందజేశారు. 

సీఎంతో ఇస్వాయ్‌ ప్రతినిధుల భేటీ: సీఎం రేవంత్‌రెడ్డితో ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్‌ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఇస్వాయ్‌) ప్రతినిధులు బుధవారం సచివాలయంలో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని