వైద్యులారా వందనం!

ఆ గ్రామానికి వెళ్లాలంటే ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులు దాటి.. ఎత్తయిన గుట్టలు ఎక్కాల్సిందే.

Published : 11 Jul 2024 03:29 IST

వాగులు దాటి.. గుట్టలు ఎక్కి.. మారుమూల గ్రామంలో వైద్యసేవలందించిన బృందం

ఛాతీలోతు ప్రవాహంలో వాగు దాటుతున్న వైద్య బృందం

ఆ గ్రామానికి వెళ్లాలంటే ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులు దాటి.. ఎత్తయిన గుట్టలు ఎక్కాల్సిందే. అటువంటి సాహసమే చేశారు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యుడు, సిబ్బంది. మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామస్థులకు వైద్యసేవలు అందించారు. ఛాతీ లోతులో ప్రవహిస్తున్న వాగులను దాటారు. మూడు ఎత్తయిన గుట్టలను ఎక్కి దిగుతూ.. మంగళవారం సాయంత్రానికి గ్రామానికి చేరుకుని బుధవారం ఉదయం వైద్య శిబిరం నిర్వహించారు.

వైద్య శిబిరంలో పరీక్షలు చేస్తున్న వైద్యాధికారి మధుకర్‌

మండల వైద్యాధికారి అల్లి మధుకర్‌ పరీక్షలు నిర్వహించారు. మలేరియా నిర్ధారణకు ఇంటింటి సర్వే చేపట్టారు. జ్వర లక్షణాలు కలిగిన ముగ్గురి నుంచి రక్తనమూనాలను సేకరించారు. గ్రామంలో దోమల నివారణకు మందు పిచికారీ చేయించారు. వైద్య సహాయకులు చినవెంకటేశ్, శేఖర్, ఎల్‌టీ రజనీకాంత్, లఖన్, ఆశా కార్యకర్త సమ్మక్క, తదితరులు ఉన్నారు.

న్యూస్‌టుడే, వాజేడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని