పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు సీఎం సత్కారం

పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గడ్డం సమ్మయ్య (చిందు, యక్షగాన కళాకారుడు), దాసరి కొండప్ప (బుర్రవీణ), వేలు ఆనందచారి (స్తపతి), కూరెళ్ల విఠలాచార్య (కవి, రచయిత), కేతావత్‌ సోంలాల్‌ (బంజారా గాయకుడు), ఉమామహేశ్వరి (హరికథా కళాకారిణి)లకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 11 Jul 2024 03:31 IST

రూ.25 లక్షల చొప్పున చెక్కుల అందజేత

ఉమామహేశ్వరి, వేలు ఆనందచారి, గడ్డం సమ్మయ్య, కేతావత్‌ సోంలాల్, దాసరి కొండప్ప, కూరెళ్ల విఠలాచార్యల ఆర్థికసాయం ఉత్తర్వులను అందజేస్తున్న సీఎం రేవంత్‌. చిత్రంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణ, మంత్రులు జూపల్లి, సీతక్క, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గడ్డం సమ్మయ్య (చిందు, యక్షగాన కళాకారుడు), దాసరి కొండప్ప (బుర్రవీణ), వేలు ఆనందచారి (స్తపతి), కూరెళ్ల విఠలాచార్య (కవి, రచయిత), కేతావత్‌ సోంలాల్‌ (బంజారా గాయకుడు), ఉమామహేశ్వరి (హరికథా కళాకారిణి)లకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సీఎం శాలువాలతో సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కులు అందించారు. నగదు బహుమతి అందజేసినందుకు ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని