GHMC: జగన్‌ ఇంటి బయట కూల్చివేతలు.. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌పై బదిలీ వేటు

హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నివాసం ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత అంశం.. ఓ అధికారి బదిలీకి దారితీసింది.

Published : 17 Jun 2024 06:10 IST

వైఎస్‌ జగన్‌ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంపై సర్కారు ఆగ్రహం 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నందుకు జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ హేమంత్‌ భోర్ఖాడేపై బదిలీ వేటు పడింది. వెంటనే రిలీవ్‌ అయి సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. లోటస్‌ పాండ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి బయట రహదారిని ఆక్రమించి సెక్యూరిటీ సిబ్బందికి గదులను నిర్మించారు. స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో ఆ కట్టడాలను తొలగించాలని జగన్‌ నివాస సిబ్బందికి జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారు పట్టించుకోకపోవడంతో శనివారం పోలీసు భద్రత మధ్య టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది పొక్లెయిన్‌తో కూల్చివేశారు.  అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని అధికారులను ఓ మంత్రి ఆదేశించగా.. దీన్ని అడ్డుకోవాలంటూ మరో మంత్రి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు