Siraj: లవ్‌ యూ సిరాజ్‌ భాయ్‌!

టీ20 ప్రపంచకప్‌-2024 విజేత భారత్‌ జట్టులో సభ్యుడైన సిరాజ్‌కు శుక్రవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, క్రికెట్‌ అభిమానులు ఘనస్వాగతం పలికారు.

Updated : 06 Jul 2024 10:44 IST

టీ20 ప్రపంచకప్‌-2024 విజేత భారత్‌ జట్టులో సభ్యుడైన సిరాజ్‌కు శుక్రవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, క్రికెట్‌ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు, సైబరాబాద్‌ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిరాజ్‌ మీడియాతో మాట్లాడుతూ..టీ20 ఫార్మాట్‌లో ప్రపంచకప్‌ను అందుకున్న రోజును జీవితంలో మరిచిపోలేనన్నాడు. ఇండియాకు మరిన్ని ప్రపంచకప్‌లు తీసుకురావడమే ఉన్నత లక్ష్యమన్నాడు. మెహిదీపట్నం సరోజిని దేవి కంటి ఆస్పత్రి వద్ద పీవీ ఎక్స్‌ప్రెస్‌పై జీప్‌ ఓపెన్‌ టాప్‌ నుంచి అతడు అభివాదం చేయగా అభిమానులు ‘‘ఇండియా.. ఇండియా.. ఇండియా...వీ లవ్‌ యూ సిరాజ్‌ భాయ్‌’’ అంటూ కేరింతలు కొట్టారు. రాత్రి 7.22 గంటలకు ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, ఖాజామేన్షన్, పోలీసాఫీసర్స్‌మెస్, నషేమన్‌ హోటల్‌ మీదుగా ఫస్ట్‌లాన్సర్‌లోని ఈద్గా మైదానం వరకు సాగింది.

న్యూస్‌టుడే, మెహిదీపట్నం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని