Hostel Warden Exam: వార్డెన్‌ పోస్టులకు 24 నుంచి పరీక్షలు

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో 581 వసతిగృహ సంక్షేమాధికారులు, వార్డెన్లు, మాట్రన్, లేడీ సూపర్‌వైజర్‌ పోస్టులకు (ఉద్యోగ ప్రకటన నం.25/2022) ఈ నెల 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 17 Jun 2024 05:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో 581 వసతిగృహ సంక్షేమాధికారులు, వార్డెన్లు, మాట్రన్, లేడీ సూపర్‌వైజర్‌ పోస్టులకు (ఉద్యోగ ప్రకటన నం.25/2022) ఈ నెల 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీఆర్‌టీ) విధానంలో రోజుకు నిర్దేశిత సంఖ్యలో అభ్యర్థులకు (మల్టీసెషన్స్‌) ఈ పరీక్షలు ఉంటాయని, నార్మలైజేషన్‌ విధానంలో మార్కుల లెక్కింపు ఉంటుందని కమిషన్‌ వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1 (జనరల్‌ స్టడీస్‌), మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఈడీ స్థాయిలో విద్యపై పేపర్‌-2 ఉంటుందని తెలిపింది. దివ్యాంగ వసతి గృహాల్లో పోస్టులకు పేపర్‌-2 పరీక్షలో డిప్లొమా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (దృష్టిలోపం, వినికిడి లోపం) సబ్జెక్టుపై ప్రశ్నలు ఉంటాయని వివరించింది. అభ్యర్థులు పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. హాల్‌టికెట్‌పై గత మూడు నెలల్లో తీసుకున్న పాస్‌పోర్టు ఫొటో అంటించాలని, హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఒరిజినల్‌) తీసుకురావాలని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని