HPCL: సిలిండర్‌ డెలివరీబాయ్‌కు అదనంగా డబ్బు ఇవ్వొద్దు: తేల్చి చెప్పిన హెచ్‌పీసీఎల్‌

గ్యాస్‌ సిలిండర్‌ను తీసుకున్న ప్రతిసారి రూ.30 లేదా రూ.50 అదనంగా చెల్లిస్తున్నారా..? ఇక ఇవ్వడం ఆపేయండి. డెలివరీబాయ్‌లకు అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని హెచ్‌పీసీఎల్‌ కంపెనీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సీకే నరసింహ స్పష్టం చేశారు.

Published : 18 Jan 2023 07:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్యాస్‌ సిలిండర్‌ను తీసుకున్న ప్రతిసారి రూ.30 లేదా రూ.50 అదనంగా చెల్లిస్తున్నారా..? ఇక ఇవ్వడం ఆపేయండి. డెలివరీబాయ్‌లకు అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని హెచ్‌పీసీఎల్‌ కంపెనీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సీకే నరసింహ స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్‌ సిలిండర్‌ చేర్చాల్సి ఉంటుందని, అందుకయ్యే ఛార్జీలు వారు చెల్లించే బిల్లులోనే కలిపి ఉంటాయని పేర్కొన్నారు. నగరానికి చెందిన రాబిన్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించగా ఈ మేరకు సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని