Hyderabad: ఓ పక్క నుంచి ప్రహరీలా కనిపిస్తున్నా.. ఇది రెండంతస్తుల ఇల్లు

హైదరాబాద్‌ మహా నగరంలో భూమి విలువ బంగారమైంది. గజం స్థలం లక్షల ధర పలుకుతోంది. ఈ క్రమంలో ప్రతి గజాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థల యజమానులు ఆలోచిస్తుంటారు.

Updated : 26 Nov 2022 10:35 IST

హైదరాబాద్‌ మహా నగరంలో భూమి విలువ బంగారమైంది. గజం స్థలం లక్షల ధర పలుకుతోంది. ఈ క్రమంలో ప్రతి గజాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థల యజమానులు ఆలోచిస్తుంటారు. అందుకు అద్దం పడుతోంది ఈ భవనం. ఓ పక్క నుంచి చూడడానికి  ప్రహరీలా కనిపిస్తున్నా.. ఇది రెండంతస్తుల ఇల్లు. నగర శివారు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుంట్లూరులో ఓ వ్యక్తి తన స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించగా.. 8.8 గజాల స్థలం మిగిలింది. ముందుభాగంలో వెడల్పు 6 అడుగులు, వెనుకకు వెళ్లే సరికి 2 అడుగులు, పొడవు 20 అడుగులతో ఉన్న ఈ స్థలంలో రెండంతస్తుల భవనం నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చిన్నపాటి కార్యాలయం, పైన అటాచ్డ్‌ బాత్రూంతో రూం కట్టి అద్దెకిచ్చారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని