Hyd News: ఆమె.. అతనయ్యారు!

అఖిలభారత సర్వీసుల చరిత్రలో మొదటిసారి ఒక మహిళా అధికారి పురుషునిగా లింగమార్పిడి చేయించుకొని తన పేరు మార్చుకున్నారు.

Published : 11 Jul 2024 02:47 IST

లింగమార్పిడి చేయించుకున్న ఐఆర్‌ఎస్‌ అధికారి

ఈనాడు, హైదరాబాద్‌: అఖిలభారత సర్వీసుల చరిత్రలో మొదటిసారి ఒక మహిళా అధికారి పురుషునిగా లింగమార్పిడి చేయించుకొని తన పేరు మార్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కస్టమ్స్‌ ఎక్సైజ్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో సంయుక్త కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం.అనుసూయ.. పురుషునిగా లింగమార్పిడి చేయించుకున్నారు. ఆ మేరకు అన్ని రికార్డుల్లో తన జెండర్‌ను మార్చాలని, పేరును ఎం.అనుకథిర్‌ సూర్యగా మార్చాలని కేంద్ర ఆర్థికశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఆమోదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై అనుసూయను అనుకథిర్‌ సూర్యగా, పురుషునిగా పరిగణించాలని అందులో పేర్కొంది. చెన్నైకి చెందిన అనుసూయ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చేశారు. సివిల్‌ సర్వీసు పరీక్షల ద్వారా 2013లో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. చెన్నై ఆదాయపన్ను విభాగంలో సహాయ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 నుంచి హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. అఖిల భారతస్థాయి అధికారి లింగమార్పిడి చేయించుకొని పేరు మార్చుకోవడం చర్చనీయాంశమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని