Fathers Day: నాన్న గుండె ఉప్పొంగిన రోజు

పిల్లలు తమ కన్నా గొప్పగా ఎదగాలని.. ఉన్నత స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీసు అయిన ఐఏఎస్‌ సాధించిన కుమార్తె తాను పని చేస్తున్న చోటుకే శిక్షణ కోసం అడుగుపెడితే ఎలా ఉంటుంది..

Updated : 16 Jun 2024 11:14 IST

ఐఏఎస్‌ కుమార్తెకు పోలీసు ఉన్నతాధికారైన తండ్రి సెల్యూట్‌
ఫాదర్స్‌ డేకు ముందు రోజు ఆవిష్కృతమైన దృశ్యం

నార్సింగి, న్యూస్‌టుడే: పిల్లలు తమ కన్నా గొప్పగా ఎదగాలని.. ఉన్నత స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీసు అయిన ఐఏఎస్‌ సాధించిన కుమార్తె తాను పని చేస్తున్న చోటుకే శిక్షణ కోసం అడుగుపెడితే ఎలా ఉంటుంది.. సినిమాల్లో కనిపించే ఇలాంటి దృశ్యం శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు అకాడమీలో ఆవిష్కృతమైంది. ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్‌లు శిక్షణలో భాగంగా శనివారం ఆర్‌బీవీఆర్‌ఆర్‌ రాష్ట్ర పోలీసు అకాడమీని సందర్శించారు. ఈ బృందంలోని ఉమాహారతికి ఆమె తండ్రి, పోలీసు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛం అందించి సరదాగా సెల్యూట్‌ చేయగా వారి మోముపై చిరుమందహాసం విరిసింది. ఆదివారం ఫాదర్స్‌ డే  జరుపుకొంటున్న తరుణంలో ఒక రోజు ముందు ఈ ఘటన జరగడం విశేషం. శిక్షణ ఐఏఎస్‌లకు అకాడమీ జాయింట్‌ డైరెక్టర్‌ మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు స్వాగతం పలకగా మరో డిప్యూటీ డైరెక్టర్‌ సి.నర్మద అకాడమీ కార్యక్రమాలను వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని