MLC Kavitha: కవిత జ్యుడిషియల్‌ కస్టడీ 25 వరకు పొడిగింపు

దిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత.. జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 25 వరకు పొడిగించింది.

Published : 04 Jul 2024 02:59 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత.. జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 25 వరకు పొడిగించింది. ఈడీ నమోదు చేసిన కేసులో కవిత, దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాల కస్టడీ గడువు బుధవారంతో ముగియడంతో జైలు అధికారులు వారిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున వారి కస్టడీ కొనసాగించాలని ఈడీ న్యాయవాదులు కోరడంతో.. 25 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. 

విద్యుత్‌ కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవి నుంచి కవిత తొలగింపు 

ఈనాడు, హైదరాబాద్‌: భారాసకు అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం(టీఆర్‌వీకేఎస్‌) గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కవితను తొలగిస్తూ బుధవారం సంఘం తీర్మానించింది.కవిత స్థానంలో కె.ప్రకాశ్‌ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని