Khairatabad Ganesh: ఖైరతాబాద్‌లో ‘పర్యావరణ గణపతి’

ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే వినాయక చవితి వేడుకలకు దాదాపు మూడు నెలల ముందు ఖైరతాబాద్‌లో చేపట్టే కర్రపూజ (తొలిపూజ)ను వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సోమవారం నిర్వహించారు.

Updated : 18 Jun 2024 06:03 IST

మంత్రోచ్చారణ మధ్య కర్రపూజ పూర్తి
తొలిసారి భారీ బందోబస్తు ఏర్పాటు

కర్ర పూజలో ఎమ్మెల్యే దానం నాగేందర్, నాయకులు

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే వినాయక చవితి వేడుకలకు దాదాపు మూడు నెలల ముందు ఖైరతాబాద్‌లో చేపట్టే కర్రపూజ (తొలిపూజ)ను వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే, గణేశ్‌  ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్‌ ఈ పూజ చేశారు. అనంతరం దానం మాట్లాడుతూ... ‘‘ఈ ఏడాది 70వ గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వినాయకుడు పూర్తిగా పర్యావరణ గణపతిగా కొలువుదీరనున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుంది’’ అని తెలిపారు. అయితే వేడుకల నిర్వహణలో రెండు కమిటీల వివాదంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. రెండు పక్షాలతో కాకుండా స్థానికులతో ఏర్పాటు చేసిన అడ్‌హక్‌ కమిటీ ఆధ్వర్యంలో పూజలు జరిగాయని వివరించారు. విగ్రహ నమూనా, ఎత్తు తదితరాలపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. కార్యక్రమంలో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ కార్యదర్శి భగవంతరావు, కోశాధికారి శశిధర్, రెండు కమిటీల ప్రతినిధులు రాజ్‌కుమార్, సందీప్‌రాజ్, మహేందర్‌బాబు, మహేష్‌యాదవ్, కృష్ణయాదవ్, వీణామాధురి తదితరులు పాల్గొన్నారు. వేడుకలను మేమంటే మేమే చేస్తామని రెండు కమిటీలు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సాధన రష్మీ పెరుమాల్, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆనంద్, చిక్కడపల్లి, గాంధీనగర్‌ ఏసీపీలు రమేష్, మొగులయ్య, ఖైరతాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ బందోబస్తులో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని