Kodada: సింగపూర్‌లో కోదాడ యువకుడి మృతి

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ యువకుడు సింగపూర్‌లో మృతి చెందిన ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన చౌడవరపు పవన్‌ (30) సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

Published : 07 Jul 2024 03:17 IST

కోదాడ, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ యువకుడు సింగపూర్‌లో మృతి చెందిన ఘటన శనివారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన చౌడవరపు పవన్‌ (30) సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. స్నేహితులతో కలిసి ఆయన శనివారం సాయంత్రం బీచ్‌కు వెళ్లారు. సముద్రం నీటి లోపలకు వెళ్లిన ఆయన అలల ధాటికి కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. మరో రెండు నెలల్లో ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లేందుకు పవన్‌ ఏర్పాట్లు చేసుకున్నారని, ఈలోపే మృత్యువు కబళించిందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని