Mohammed Siraj: సిరాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం: సీఎం రేవంత్‌

టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు.

Published : 10 Jul 2024 06:13 IST

క్రికెటర్‌ సిరాజ్‌ను సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు, పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి సిరాజ్‌ పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడని సీఎం ప్రశంసించారు. ప్రపంచకప్‌ విజయానంతరం హైదరాబాద్‌ చేరుకున్న సిరాజ్‌.. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సిరాజ్‌ను సీఎం సన్మానించారు. అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ.. అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడంటూ సిరాజ్‌కు కితాబిచ్చారు. సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని.. ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని