Land cruisers: త్వరలో మంత్రులకు ల్యాండ్‌క్రూయిజర్లు

రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు కొత్త ల్యాండ్‌క్రూయిజర్లు అందుబాటులోకి రానున్నాయి. బుల్లెట్‌ప్రూఫ్‌ సదుపాయంతో కూడిన ఈ వాహనాలు సుదీర్ఘకాలం తర్వాత ఇప్పుడు వినియోగానికి సిద్ధమయ్యాయి.

Published : 12 Jun 2024 04:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు కొత్త ల్యాండ్‌క్రూయిజర్లు అందుబాటులోకి రానున్నాయి. బుల్లెట్‌ప్రూఫ్‌ సదుపాయంతో కూడిన ఈ వాహనాలు సుదీర్ఘకాలం తర్వాత ఇప్పుడు వినియోగానికి సిద్ధమయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లోనే అప్పటి భారాస మంత్రివర్గం కోసం 22 ల్యాండ్‌ క్రూయిజర్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటికి బుల్లెట్‌ప్రూఫ్‌ సదుపాయం కల్పించేందుకు.. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా వీరపనేనిగూడేనికి తరలించారు. అయితే విదేశాల నుంచి రావాల్సిన బుల్లెట్‌ప్రూఫ్‌ సామగ్రి సకాలంలో అందుబాటులోకి రాకపోవడం, బడ్జెట్‌ సమస్యతో వాహనాలు అక్కడే ఉండిపోయాయి. ఇటీవలే ఆ వాహనాలు రాష్ట్రానికి చేరుకోగా.. మంత్రులకు అందజేయడంపై నిఘావిభాగం దృష్టిసారించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు