Uttarakhand: ఉత్తరాఖండ్‌లో విరిగిన కొండచరియలు.. ఇద్దరు తెలంగాణ యాత్రికుల దుర్మరణం

దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. చమోలీ జిల్లా కర్ణప్రయాగ, గౌచర్‌ల మధ్యలో బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు తెలంగాణవాసులు మృతి..

Updated : 07 Jul 2024 03:19 IST

గోపేశ్వర్, హైదరాబాద్‌: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. చమోలీ జిల్లా కర్ణప్రయాగ, గౌచర్‌ల మధ్యలో బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు తెలంగాణవాసులు మృతి చెందినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన నిర్మల్‌ షాహీ(36), సత్యనారాయణ(50) బద్రీనాథ్‌ ఆలయాన్ని దర్శించుకుని ద్విచక్ర వాహనంపై తిరిగొస్తుండగా... మార్గమధ్యంలో వారిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దాంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ వ్యాప్తంగా ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కొండచరియలు సైతం విరిగిపడుతుండటంతో బద్రీనాథ్, రుద్రప్రయాగ్‌-కేదార్‌నాథ్‌ జాతీయ రహదారులపై పలుచోట్ల రోడ్లు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని