Damodara Rajanarasimha: ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యం

ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు.

Published : 21 Jun 2024 06:13 IST

మంత్రి దామోదర్‌ రాజనర్సింహ
రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసిన మంత్రులు

రాజ్‌భవన్‌ పాఠశాలలో పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేస్తున్న మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌  

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్‌ రాజనర్సింహ మాట్లాడుతూ.. రక్తహీనత, నీరసం, చదువులో వెనుకబాటుకు నులిపురుగులే ప్రధాన కారణమని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు  ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది’’ అని వివరించారు. అనంతరం నులి పురుగుల నివారణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ..  జూన్‌ 27 వరకు హైదరాబాద్‌లో ఉన్న 11,17,118 మంది పిల్లలకు ఈ మాత్రలు ఇస్తామన్నారు. 1-19 ఏళ్ల వయసు పిల్లలకు తల్లిదండ్రులు తప్పక ఈ మాత్రలు ఇప్పించాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్‌ విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని