Mohan Babu: ప్రతి ఇంట్లో ఉండే సమస్యే: ‘కుటుంబ వివాదం’పై మోహన్‌బాబు వ్యాఖ్య

ప్రతి ఇంట్లో భార్యాభర్తలు, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలే మా ఇంట్లోనూ ఉన్నాయని ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు (Mohan Babu) పేర్కొన్నారు.

Updated : 07 Apr 2023 10:23 IST

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడేః ప్రతి ఇంట్లో భార్యాభర్తలు, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలే మా ఇంట్లోనూ ఉన్నాయని ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు (Mohanbabu) పేర్కొన్నారు. గురువారం తిరుపతిలో ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి కుమారులు మంచు విష్ణు (Vishnu), మంచు మనోజ్‌ (Manoj)లతో కలిసి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. కుమారుల మధ్య నెలకొన్న వివాదం గురించి మాట్లాడే సమయం ఇది కాదంటూ వెళ్లిపోయారు. వివాదంపై స్పందించాలని మంచు మనోజ్‌ను మీడియా ప్రశ్నించగా.. భుజంపై వేడి గడ్డ వచ్చిందంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘వాట్‌ ది ఫిష్‌’ (మనం మనం బరంపురం) సినిమాను ఇటీవల ప్రారంభించామని.. ప్రస్తుతం కెనడాలో చిత్రీకరణ సాగుతోందని తెలిపారు. మనోజ్‌ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని