Nani: ప్రేక్షకుల్ని అవమానించేలా ఏపీ ప్రభుత్వ నిర్ణయం: సినీనటుడు నాని

సినిమా టికెట్‌ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రేక్షకుల్ని అవమానించేలా ఉందన్నారు సినీనటుడు నాని. హైదరాబాద్‌లో గురువారం జరిగిన

Updated : 24 Dec 2021 05:42 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సినిమా టికెట్‌ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రేక్షకుల్ని అవమానించేలా ఉందన్నారు సినీనటుడు నాని. హైదరాబాద్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ నాయకులు, సినిమావాళ్లు అనే విషయాన్ని పక్కనపెడితే.. ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉంది. ఈరోజు ఎక్కడో చూశాను.. టికెట్ల రేట్లు రూ.10, రూ.15, రూ.20 అని. పది మందికి ఉద్యోగాలిచ్చి, పెద్ద థియేటరు నడుపుతున్న వ్యక్తి కౌంటర్‌ కంటే.. పక్కనున్న కిరాణాస్టోర్‌ కలెక్షన్‌ ఎక్కువగా ఉండటం సెన్స్‌ లెస్‌. టికెట్‌ కొనే సామర్థ్యం ప్రేక్షకులకుంది. కానీ ప్రభుత్వమే ప్రేక్షకులకు ఆ స్థాయి లేదని నిర్ణయించడం నిజంగా వారిని అవమానించినట్లే. అయితే దీనిపై ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది’ అని నాని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని