
Corona: కేంద్ర మంత్రి గడ్కరీ, ప్రముఖగాయని లతా మంగేష్కర్‌కు కరోనా
కథానాయకి కీర్తిసురేష్కూ కొవిడ్
దిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కొవిడ్-19 సోకింది. ఈ విషయాన్ని ఆయన మంగళవారం వెల్లడించారు. తనకు ప్రస్తుతం ఇన్ఫెక్షన్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయన్నారు. నిబంధనల ప్రకారం ఇంట్లోనే విడిగా ఉంటున్నానని తెలిపారు. తనకు దగ్గరగా వచ్చినవాళ్లంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ట్విటర్లో కోరారు.
* కరోనా సోకడంతో ఇంట్లోనే వేరుగా ఉంటున్న రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బాగా కోలుకుంటున్నారని, దిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ఆయన్ను పరీక్షించిందని రక్షణశాఖ తెలిపింది.
ముంబయి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె మేనకోడలు రచన మంగళవారం వెల్లడించారు. ‘‘లతకు రెండు రోజుల క్రితం స్వల్ప లక్షణాలతో కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ముంబయిలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆమె వయసును దృష్టిలో పెట్టుకొని వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మా గోప్యతను గౌరవించండి. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’’ అని రచన కోరారు. ప్రముఖ కథానాయకుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానేఖాన్ సైతం కొవిడ్ బారిన పడ్డారు.
కీర్తిసురేష్
తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు కరోనాతో బాధపడుతున్నారు. కథానాయకి కీర్తిసురేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మంగళవారం ట్విటర్ ద్వారా ఆమె ఈ విషయాన్ని తెలియజేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. ఇది కొవిడ్ విస్తృత వ్యాప్తికి సంకేతమని, అందరూ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చారు.
* ప్రముఖ నటి రేణూదేశాయ్, ఆమె తనయుడు అకీరా సైతం కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. ఆ విషయాన్ని రేణూదేశాయ్ మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Devendra Fadnavis: భాజపా, శివసేన.. వేర్వేరు అనుకోలేదు: ఫడణవీస్
-
Sports News
Bumrah : బుమ్రాకు టెస్టు క్రికెట్ చాలా తేలికగా అనిపిస్తోంది : అజిత్ అగార్కర్
-
General News
Hyderabad News: ముందైనా వెళ్లండి.. తర్వాతైనా రండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
-
India News
India Corona: దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు
-
World News
Israel: హెజ్బొల్లా డ్రోన్లను కూల్చిన ఇజ్రాయెల్..!
-
Sports News
Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి