Medigadda Barrage: మేడిగడ్డ 7వ బ్లాక్‌లో మళ్లీ సమస్య?

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ 7వ బ్లాకులో మళ్లీ ఓ సమస్య ఉత్పన్నమైనట్లు బుధవారం ప్రచారం జరిగింది.

Updated : 04 Jul 2024 03:32 IST

ఈనాడు డిజిటల్‌-జయశంకర్‌ భూపాలపల్లి, మహదేవపూర్‌-న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ 7వ బ్లాకులో మళ్లీ ఓ సమస్య ఉత్పన్నమైనట్లు బుధవారం ప్రచారం జరిగింది. ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టగా.. ఆ ప్రాంతంలోనే సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ, నీటిపారుదలశాఖ ఇంజినీరింగ్‌ అధికారులు రాత్రిపూట హుటాహుటిన బ్యారేజీకి చేరుకుని పరిశీలించారు. రాత్రి కావడంతో ఎక్కడ ఏం జరిగిందో తమ దృష్టికి రాలేదని వారు చెబుతున్నారు. తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు వీలుగా 7వ బ్లాక్‌ పరిధిలో గోదావరిలో నిర్మించిన రింగ్‌ బండ్‌ తొలగింపు పనులను విద్యుత్తు దీపాల వెలుతురులో చేపట్టారు. అర్ధరాత్రి వరకు పనులు కొనసాగుతూనే ఉన్నాయి.. బ్యారేజీకి సమస్య ఏర్పడినట్లు ప్రచారం జరగడం, రింగ్‌ బండ్‌ తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన చేస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డిని ఫోన్లో సంప్రదించగా.. బ్యారేజీ వద్ద సమస్యలు ప్రస్తుతానికి గుర్తించలేదని, పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని