BV Pattabhiram: తెలుగువారు గర్వించదగిన ఇంద్రజాలికుడు డా.బి.వి.పట్టాభిరాం

తెలుగువారు గర్వించదగిన ఇంద్రజాలికుడు డాక్టర్‌ బి.వి.పట్టాభిరాం అని పలువురు వక్తలు కొనియాడారు.

Published : 17 Jun 2024 04:20 IST

‘జీవితం ఒక ఉత్సవం’ పుస్తకావిష్కరణలో వక్తలు

పుస్తకం ఆవిష్కరించిన ఎమెస్కో విజయ్‌కుమార్, వల్లీశ్వర్, రామచంద్రమూర్తి, డా.పట్టాభిరాం, జయశేషు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: తెలుగువారు గర్వించదగిన ఇంద్రజాలికుడు డాక్టర్‌ బి.వి.పట్టాభిరాం అని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా.పట్టాభిరాం, జయశేషుల వైవాహిక జీవిత స్వర్ణోత్సవం సందర్భంగా డా.పట్టాభిరాం రాసిన జీవితం ఒక ఉత్సవం(నా బతుకు కథ) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎమెస్కో విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు, సినీనటుడు రాజేంద్రప్రసాద్, సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, కె.వి.పి.రామచంద్రరావు, ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శులు ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, ఐ.వి.ఆర్‌.కృష్ణారావు, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ అదనపు కమిషనర్‌ ప్రసాదరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు నడవడిక నేర్పిన కమ్యునికేషన్స్‌ చతురుడిగా పట్టాభిరాం తెలుగువారి కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేశారన్నారు. లక్షల మంది విద్యార్థుల్లో నిర్వేదం తొలగించి వారి జీవితాలను తీర్చిదిద్దిన మార్గదర్శి అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని